సుదర్శన్‌ థియేటర్లో ఫ్యాన్స్‌తో కలిసి లైగర్‌ చూసిన విజయ్‌, అనన్య

Vijay Deverakonda and Ananya Pandey Watch Liger Movie With Fans,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Rowdy Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest Movie Liger,Liger Movie,Liger,Liger Telugu Movie,Liger Movie Latest Updates,Vijay Deverakonda and Ananya Pandey Watch Liger Telugu Movie with Fans,Liger Telugu Movie Collections Updates,Liger Movie Colletions,Liger Movie Review,Liger Movie Public Talk,Liger Movie Public Response

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఈ రోజు (25 వ తేదీ)భారీ అంచనాలతో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం  అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.విజయ్‌ దేవరకొండ పర్ఫార్మెన్స్‌ అదుర్స్‌ అనిపించేలా ఉందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సుదర్శన్‌ 35ఎంఎం థియేటర్లో హీరో, హీరోయిన్‌ విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఫ్యాన్స్‌తో కలిసి లైగర్ మూవీ ని చూశారు . గురువారం ఉదయం నుంచి సుదర్శన్‌ థియేటర్‌ దగ్గర ఫ్యాన్స్‌ హంగామా మొదలు కాగా.. ఈ ఇద్దరూ అక్కడికి వచ్చేసరికి వాళ్లను చూడటానికి ఎగబడ్డారు, తర్వాత థియేటర్లో ఫ్యాన్స్‌ ఈలలు, గోలల మధ్య సినిమాను చూశారు. అభిమానులు వీళ్ల దగ్గరికి వెళ్లకుండా విజయ్‌, అనన్య చుట్టూ బౌన్సర్లు నిల్చొని ఉండటం విశేషం. మూవీ రిలీజ్‌కు ముందే విజయ్‌, అనన్య దేశమంతా తిరుగుతూ ప్రమోషన్లలో పాల్గొన్నారు. స్పెషల్‌ స్క్రీనింగ్స్‌ కూడా చూశారు. ఇక ఇప్పుడు ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తూ ఆ మ్యాజిక్‌ ని ఎంజాయ్‌ చేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × five =