ప్రపంచవ్యాప్తంగా నెట్ ఫ్లిక్స్ లో 14 వారాలుగా ట్రెండింగ్ లో ఆర్ ఆర్ ఆర్

RRR Movie Creates A New Record,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Creates New Records,SS Rajamouli RRR Movie creates New Record,Director SS Rajamouli,RRR Movie Trending in Netflix,RRR Movie in Netflix,Jr NTR and Ram Charan,Jr NTR and Ram Charan Multi Starrer Movie RRR,RRR Movie Creates Records in Netflix

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. దక్షిణాది భాషల వెర్షన్స్ జీ 5 లో స్ట్రీమింగ్ కాగా “ఆర్ ఆర్ ఆర్”మూవీ హిందీ వెర్షన్ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవడం తో గ్లోబల్ గా ప్రేక్షకులకు రీచ్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీపై హాలీవుడ్ రైటర్స్ , డైరెక్టర్స్ ప్రశంసలు కురిపిస్తున్న విషయం తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ మరియు జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా ఇంకా కొనసాగుతూనే ఉంది. పాన్ఇండియా స్థాయిలో విడుదలైనప్పటికీ.. హాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుందీ చిత్రం. థియేటర్లోనే కాకుండా ఓటీటీ వేదికగా కూడా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా మరో అరుదైన ఘనతను సాధించింది. ఏ ఇంగ్లీష్, నాన్ ఇంగ్లీష్ సినిమాలకు దక్కని రికార్డును సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై 14 వారాలైనా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండటం విశేషం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.