చందూమొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కార్తికేయ2. కార్తికేయ సీక్వెల్ గా వచ్చిన ఈసినిమా మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. ద్వారక, కృష్ణుడి కంకణం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కించాడు చందూ మొండేటి. ఫైనల్ గా ఈసినిమా ఆగష్ట్ 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక నార్త్ లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నప్పటికీ నార్త్ లో అస్సలు ప్రమోషన్సే పెద్దగా చేయలేదు. కానీ రిలీజ్ తర్వాత మౌత్ టాక్ తోనే నార్త్ లో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈసినిమా ఇప్పుడు అక్కడ వెయ్యికి పైగా స్క్రీన్లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం నార్త్ లో కూడా సూపర్ క్రేజ్ తో కార్తికేయ2 సందడి చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా చందూ మొండేటి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ను కలిశారు. ఈనేపథ్యంలో బిగ్ బీ తో తీసుకున్న ఫొటోను తన సోషల్ మీడియా ద్వారా పంచుకంటూ.. ‘ఆ దీవెనలు..జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు..అమితాబ్ జీ ధన్యవాదాలు..’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడు ఈఫొటో వైరల్ అవుతుంది.
కాగా చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా వచ్చిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ పతాకాల పై సంయుక్తం గా నిర్మించిన ఈసినిమాకు కాల భైరవ సంగీతం అందించాడు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: