సినీ కార్మికులకై చిరు బర్త్ డే కానుక

Chiranjeevi to build a free hospital for Cine Workers in Chitrapuri,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi Birthday,Chiranjeevi Birthday Celebrations,Chitrapuri Committee,Chiranjeevi Hospital,Cini Workers,Chitrapuri Colony,Megastar Chiranjeevi Pre Birthday Celebrations,Megastar Chiranjeevi Birthday Celebrations,Celebrity Cricket League,CCL,Megastar Hospital For Cine Workers,Chiranjeevi to build a free hospital,Chiranjeevi Movies,Chiranjeevi Latest News

చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా స్టార్ చిరంజీవి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ , ఐ బ్యాంక్ తో మెగా స్టార్ చిరంజీవి ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ సంస్థలు ‘అత్యుత్తమ సేవా సంస్థలు’గా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకొన్నాయి. కరోనా సమయం లో పలు ఆక్సిజన్ బ్యాంక్స్ ద్వారా కరోనా బాధితులకు సేవలందించారు. కరోనా సమయం లో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించి వారిని ఆదుకున్నారు. తాజాగా చిరంజీవి తన బర్త్ డే (ఆగస్ట్ 22) సందర్భంగా మరో మంచి పనికి నిర్ణయం తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. చిత్రపురి కాలనీలో నివశించే సినీ కార్మికుల కోసం మా నాన్న కొణిదెల వెంక్రటావుగారిపేరున ఆస్పత్రి కట్టాలనుకున్నాననీ , ఈ ఆలోచన వచ్చినప్పటి నుంచీ దానిపై పనిచేస్తున్నాననీ , ఎన్ని కోట్లు ఖర్చు అయినా పెట్టగలిగే శక్తి భగవంతుడు తనకు ఇచ్చాడనీ , ఎవరైనా సాయం చేయడానికి ముందుకొస్తే వారికి కూడా అవకాశం కల్పిస్తామనీ , వచ్చే ఏడాదికి పుట్టినరోజుకి ఆ ఆస్పత్రి సేవలు అందుబాటులోకి వస్తాయనీ చెప్పారు. చిరంజీవి నిర్ణయానికి సినీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.