ఒకప్పుడు టాలీవుడ్ లో క్యూట్ పెయిర్లలో నాగచైతన్య-సమంత పేర్లు కూడా ఉండేవి. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయి ఎవరి జీవితాలు వారు జీవిస్తున్నారు. ఎవరి కెరీర్ లో వాళ్లు బిజీ అయిపోయి జీవిస్తున్నారు. అయితే వారు విడిపోయి చాలాకాలం అయిపోతున్నా కూడా ఎక్కడికి వెళ్లినా ఈవిషయంపై మాత్రం ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇక ప్రస్తుతం నాగచైతన్య లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈసందర్భంగా ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈనేపథ్యంలో చైతు-సామ్ విడాకుల గురించి అడుగుగా.. దానికి చైతు సమంత అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోయామని.. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నామని, చెప్పామని అన్నారు. కానీ ఇప్పటికీ కొంతమంది తమకు ఇష్టమొచ్చినట్టు ఏవేవో వార్తలు రాస్తున్నారని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. నాగ చైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈసినిమాను వయాకామ్ 18 స్టూడియోస్ సంస్థలు రూపొందిస్తున్నాయి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాలో మోనా సింగ్, యోగి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న సంగతి తెలిసిందే కదా. చిరు కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: