‘బింబిసార’ హిట్.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ నోట్..!

Kalyan Ram Gets Emotional About Bimbisara Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Blockbuster Movie,Bimbisara Latest Updates,Nandamuri Kalyan Ram,Kalyan Ram,Kalyan Ram about Bimbisara Movie, Kalyan Ram Gets Emotional About Bimbisara Movie Success,Kalyan Ram Get Emotional For Bimbisara Blockbuster Hit,Bimbisara MOvie Collections,Bimbisara First day Collections,Bimbisara Telugu States Collections updates

మొత్తానికి చాలా గ్యాప్ తరువాత వచ్చి సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కళ్యాణ్ రామ్. కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి ఈమద్య విభిన్నమైన కథలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పుడు బింబిసార అంటూ కెరీర్ లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వచ్చాడు. మల్లిడి విశిష్ట అనే కొత్త దర్శకుడితో బింబిసార సినిమా తీసి సూపర్ హిట్ ను కొట్టాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు చాలా రోజుల తరువాత మళ్లీ ఈసినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకుంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తనకు ఇలాంటి సాలిడ్ హిట్ ను అందించినందుకు ఫ్యాన్స్ కు చిత్రయూనిట్ తో పాటు ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. 2019 లో బింబిసార కథను విన్నప్పుడు.. ఎంతో ఎగ్జైట్ అయ్యానని, ఈ కథను త్వరగా అందరికీ చూపించాలని ఎంతో అనుకున్నాడట. కానీ మధ్యలో కరోనా, లాక్డౌన్‌లు వంటివి వస్తుండటం.. ఆలస్యం అవుతూ వచ్చింది. ఫైనల్ గా మీముందుకు వచ్చిన మాకు ఇంత పెద్ద విజయం అందించారు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, ఇది కేవలం బింబిసార సక్సెస్ మాత్రమే కాదు, యావత్ టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సక్సెస్ అంటూ కళ్యాణ్ రామ్ తన నోట్ లో తెలిపారు.

కాగా ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మించాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా నటించగా.. వారినా హుస్సేన్, వివాన్ భటేనా, ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందించారు.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =