ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా బింబిసారుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన “బింబిసార”మూవీ ఈ రోజు (ఆగస్ట్ 5వ తేదీ )రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది.హీరో కళ్యాణ్ రామ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన “బింబిసార”మూవీలో క్యాథరిన్, సంయుక్త మీనన్ కథానాయికలు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , చిరంతన్ భట్ సంగీతం అందించారు. పలు ఎమోషన్స్ గాని తన డాషింగ్ లుక్ ముఖ్యంగా బింబిసార గా తన డైలాగ్ డెలివరీ తో కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Hearing great things about #Bimbisara. It feels good when people enjoy a film with the sort of enthusiasm we felt while watching it for the first time.
— Jr NTR (@tarak9999) August 5, 2022
హీరో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “బింబిసార” మూవీ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా లో స్పందించారు.”బింబిసార” మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “బింబిసార”మూవీ అద్భుతాలు చేస్తోందని వింటున్నాననీ , సినిమాని మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులు ఎంతో ఉద్వేగంతో, ఎనలేని ఉత్సాహంతో చూస్తున్నారన్న వార్తలు ఎంతో ఆనందానిస్తాయనీ , కళ్యాణ్ అన్నయ్యా! “బింబిసార” చక్రవర్తిగా నీ నటనకి సాటి మరొకరు లేరనీ , ఎంతో తలపండిన అనుభవజ్ఞుడిలా దర్శకుడు వశిష్ట ఈ సినిమాని తీర్చిదిద్దారనీ , లెజెండరీ సంగీత దర్శకులు కీరవాణి ఈ సినిమాకి వెన్నెముక అనీ , ఈ ఘనవిజయానికి కారకులైన నటీనటులు, టెక్నీషియన్లకి తన అభినందనలు అంటూ ఎన్టీఆర్ ట్వీట్స్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.