‘బింబిసార’ రివ్యూ.. థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ మూవీ..!

Bimbisara Telugu Movie Review,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Bimbisara Movie Review,Bimbisara Review,Bimbisara Telugu Review,Bimbisara Movie Telugu Review,Bimbisara Movie Review And Rating, Bimbisara Movie Rating,Bimbisara (2022 film),Bimbisara Movie (2022),Bimbisara (2022) - Movie,Bimbisara (2022)-Review, Bimbisara - Telugu Movie Reviews,Bimbisara (2022),Bimbisara: Movie Review,Bimbisara Movie Review 2022, Bimbisara Review 2022,Bimbisara Movie Highlights,Bimbisara Movie Plus Points,Bimbisara Movie Review Telugu, Bimbisara movie First Review out,Bimbisara Movie Public Talk,Bimbisara Movie Public Response,Bimbisara 2022, Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara Movie Updates,Bimbisara Telugu Movie Updates, Bimbisara Telugu Movie Live Updates,Bimbisara Movie Latest News,Bimbisara Telugu Movie Latest News, Bimbisara Review And Rating,Bimbisara Telugu Movie 2022,Bimbisara The Movie,Kalyan Ram,Kalyan Ram Bimbisara Movie Review, Kalyan Ram,Catherine Tresa,Samyuktha Menon,Warina Hussain,Vennela Kishore,Brahmaji,Srinivas Reddy,Kalyan Ram and Samyuktha Menon Bimbisara Movie Review

మల్లిడి వశిష్ట్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్‌ ఫిల్మ్ బింబిసార. టైమ్ ట్రావెల్, పీరియాడిక్ జానర్‌లో వస్తున్న ఈ సినిమాకు మొదటి నుండి మంచి బజ్ ఉంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌‌తో పాటు లిరికల్ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు.. కళ్యాణ్ రామ్, కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్, వారినా హుస్సేన్, వివాన్ భటేనా, ప్రకాష్ రాజ్, అయ్యప్ప శర్మ, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష తదితరులు
దర్శకత్వం.. మల్లిడి వశిష్ట్
బ్యానర్స్.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్
నిర్మాత.. హరికృష్ణ.కె
సంగీతం.. ఎం.ఎం. కీరవాణి
సినిమాటోగ్రఫి..ఛోటా కె. నాయుడు

కథ..

ఈసినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వస్తుందని ఇప్పటికే టీజర్, ట్రైలర్ లను బట్టి అర్థమవుతుంది. త్రిగర్తల సామ్రాజ్య అధినేత బింబిసార. తనకు ఇష్టంవచ్చినట్టు రాజ్యాలను కొల్లగొట్టుకుంటూ.. తనకు ఎదురొచ్చిన వారిని అణగదొక్కి రాజ్యాలను ఆక్రమించుకుంటూ వెళుతుంటాడు. అయితే అతను ప్రపంచాన్ని జయించాలని నిర్ణయించుకుని యుద్దంలోకి దిగుతాడు. కాల ప్ర‌వాహంలో క‌లిసిపోతాడు. త‌ర్వాత మ‌ళ్లీ క‌లియుగంలోకి వ‌చ్చి త‌న‌కు చెందిన నిధిని కాపాడుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. మరోవైపు ఈ తరంలో బింబిసారుడు దాచిన నిధి తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్న సుబ్రహ్మణ్యశాస్త్రి (వివాన్ భటేనా) ఎవరు? అతడిని బింబిసారుడు ఎలా అడ్డుకున్నాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ..

చరిత్రలో ఎంతోమంది మహామహుల గురించి మనకు తెలిసి ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు ద్వారా వారి చరిత్రలు తెలుస్తుంటాయి. అలాంటి ఓ రాజు కథనే మన ముందుకు తీసుకొచ్చాడు మల్లిడి విశిష్ట్. కొత్తతరం, యువ దర్శకులు ఈమధ్య కాలంలో దూసుకుపోతున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నారు. ఇక విశిష్ట్ కు కూడా ఇదే మొదటిసినిమా అయినా కూడా చాలా కొత్త, విభిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చాడు. మైథలాజికల్ కాన్సెప్ట్ కి ఫాంటసీని జోడించి టైం ట్రావెల్ చేయించడం అనే పాయింట్ ను తీసుకొని దాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ఈసినిమా సక్సెస్ లో ప్రధాన భాగమైందని చెప్పొచ్చు. సినిమా మొదలైనప్పటి నుండి చివరి వరకూ పలు థ్రిల్లింగ్ అంశాలతో ఎంగేజ్ చేయగలిగాడు.

చాలా గ్యాప్ తీసుకొని కళ్యాణ్ రామ్ ఈసినిమాతో వచ్చాడు. అంతేకాదు ఇంతవరకూ తను చేసిన సినిమాలు ఒక ఎత్తైతే.. ఈసినిమా మరో ఎత్తు. తన కెరీర్ లో మొదటిసారిగా ఇలాంటి పాత్రతో వస్తున్నాడు. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి.. అలాంటి అవకాశాలను వదులుకోకుండా ధైర్యం చేసి ప్రయోగం చేయగలిగితేనే నటుడిగా ఫ్రూవ్ చేసుకోడానికి వీలుంటుంది. ఇక కళ్యాణ్ రామ్ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ఈసినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అక్కడే సగం సక్సెస్ అయ్యాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో పెర్ఫార్మెన్స్ పరంగా ఇది కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అనడంలో ఎలాంటి సందేహం లేదు, బింబిసారగా కళ్యాణ్ రామ్ జీవించేశాడు అని చెప్పాలి. అలానే ఈతరం పాత్రలో కూడా హీరోయిజంతో మెప్పించాడు. ఇక విశ్వానందన్ వర్మ (ప్రకాష్ రాజ్) పాత్ర కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇంకా కేథరిన్, సంయుక్త మీనన్ పాత్రల నిడివి తక్కువే అయినా కూడా ఉన్నంతలో చక్కగా నటించారు. ఇక శ్రీనివాస రెడ్డి సహా తదితర నటులు తమ పాత్రల మేర నటించి మెప్పించారు.

ఇలాంటి సినిమాలకు సాంకేతిక విభాగం కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. ఈసినిమాకు టెక్నికల్ వాల్యూస్ కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఈసినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. మేకర్స్ భారీ మొత్తంలో పెట్టిన ఖర్చు దానికి న్యాయం ఈ విజువల్స్ లో కనిపిస్తుంది. ఇక పాటల సంగతి పక్కన పెడితే కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మరో హైలెట్. సినిమాటోగ్రఫి కూడా ప్రధాన ఆకర్షణ గా నిలుస్తుంది.

ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో ఒక జోనర్ కు మత్రమే ఈసినిమా నచ్చుతుందని కాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఓ డిఫెరెంట్ ఫీల్ ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 10 =