పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ “కార్తికేయ” మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన “కార్తికేయ 2 “మూవీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఫైనల్ గా ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక వెరైటీ సెంటిమెంట్ హీరో నిఖిల్ విషయంలో జరుగుతోంది. ప్రతిసారి రిపీట్ అవుతోంది. అదేంటంటే.. రిలీజ్ కోసం స్ట్రగుల్ అయిన ప్రతిసారి నిఖిల్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇలా తనపై నడుస్తున్న వెరైటీ సెంటిమెంట్ గురించి ఓ మీడియా ప్రతినిధి ద్వారా తెలుసుకొన్న నిఖిల్ మాట్లాడుతూ ..ఆ విషయం నిజమేననీ , ఏదో ఒక గండం వస్తేనే తనకు సక్సెస్ వస్తోందనీ , “ఎక్కడకిపోతావ్ చిన్నవాడా” సినిమా టైమ్ లో డీ-మానిటైజేషన్ వచ్చిందనీ , పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన తొలి సినిమా మాదేననీ , అలాంటి పెద్ద గండం తర్వాత వచ్చినప్పటికీ మా సినిమా హిట్టయిందనీ , “అర్జున్ సురవరం” సినిమా కూడా చాలాసార్లు వాయిదాపడిందనీ , ఎన్నో గండాలు దాటి హిట్టయిందనీ , ఇప్పుడు “కార్తికేయ-2” మూవీ కి కూడా గండాలు వచ్చాయనీ , 3 దశల కరోనా వచ్చిందనీ , మధ్యలో రిలీజ్ డేట్స్ మారాయనీ , సో.. ఈ సినిమా కూడా హిట్టవుతుందనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.