పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు , తమిళ , హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ “సీతారామం”మూవీ లో కీలక పాత్రలో నటించిన రష్మిక కథానాయిక గా “పుష్ప :ది రూల్”మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దళపతి విజయ్ హీరో గా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “వారసుడు “మూవీ లో విజయ్ కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను ”విడుదలకు సిద్ధంగా ఉంది. బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “ , రణ్ బీర్ కపూర్ “యానిమల్ “ బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.శశాంక్ ఖేతాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కుతున్న “స్క్రూ ఢీలా”హిందీ మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా రష్మిక ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ .. తన సినిమాలలో పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటేనే సంతృప్తికరంగా అనిపిస్తుందనీ , ప్రస్తుతం తెలుగు మూవీస్ కు డబ్బింగ్ చెబుతున్నాననీ , ఇక తమిళ .. మలయాళ భాషలు కూడా నేర్చుకుని డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాననీ , ఒక వైపున షూటింగులు .. మరో వైపున డబ్బింగులు.. ఇలా బిజీ బిజీగా ఉంటూనే అటు వివిధ భాషలు నేర్చుకునే క్లాసులు.. ఇలా తనకు 24 గంటలు సరిపోవడం లేదనీ , అందుకే రోజుకు 36 గంటలుంటే బాగుండునని అనిపిస్తోందనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: