రవన్న నాకు ఇన్స్పిరేషన్..!

Nani Says Ravi Teja is his Inspiration,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Natural Star Nani,Nani,Natural Star Nani At Rama Rao On Duty Movie Pre Release Event,Nani About Ravi Teja, Mass Maha Raja Ravi Teja,Natural Star Nani About Ravi Teja,Ravi Teja upcoming Movie Ramarao on Duty,Ramarao Duty Movie latest updates, Nani Says Ravi Teja His Inspiration,Nani About Ravi Teja Movie Rama Rao on Duty latest Updates

శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమా తెరకెక్కించారు మేకర్స్. ఇక ఈసినిమా జులై 29న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టి వరుసగా అప్ డేట్స్ కూడా ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఈ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని అతిథిగా వచ్చిన సంగతి కూడా విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు నేను అతిథిగా రాలేదు.. రవన్న గురించి మాట్లాడాలనే వచ్చా. చిరంజీవి గారు అంటే రవితేజకు చాలా ఇష్టం. రవన్న సినీ కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్నారు. మేము కెరీర్‌ మొదలు పెట్టినప్పుడు రవన్నను స్ఫూర్తిగా తీసుకున్నాం. చిరంజీవి గారి క్యారవ్యాన్‌లోకి రవితేజ అన్న వెళ్లిన సీన్‌ చూశా. త్వరలో నేనూ కూడా రావన్న క్యారవాన్‌లోకి వెళతానని అనుకుంటున్నా. అది జరుగుతుంది’ అని అన్నారు. మరి చూద్దాం నాని స్టేట్ మెంట్ తో వీరిద్దరి కాంబినేషన్ సినిమా ఫ్యూచర్ లో వస్తుందేమో..

కాగా ఈసినిమాలో దివ్యాంశ కౌశిక్, ర‌జిష విజయన్ హీరోయిన్లుగా న‌టిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజ‌ర్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, ప‌విత్ర లోకేష్ ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌, ఆర్‌టీ టీం వర్క్స్‌ బ్యానర్లపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండ‌గా స‌త్య‌న్ సూర్య‌న్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − nine =