సూపర్ హిట్ “మజిలీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దివ్యాంశ కౌశిక్ , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ తో ప్రేక్షకులను దివ్యాంశ కౌశిక్ అలరించనున్నారు. “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ జూలై 29 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ మూవీ రిలీజ్ సందర్బంగా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీగా చేపట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దివ్యాంశ కౌశిక్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. హీరోలు రవితేజ , నాగచైతన్య లపై కామెంట్స్ చేశారు. రవితేజ , నాగచైతన్య లు ఇద్దరూ భిన్నమైన వ్యక్తులనీ , రవితేజ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారనీ , నాగచైతన్య కామ్ గా ఉంటారనీ , అయితే ఇద్దరిలో ఒక కామన్ క్వాలిటీ ఉందనీ, సెట్స్ లో సరదాగా ఉంటారనీ , ఫ్రాంక్స్ కూడా చేస్తుంటారనీ , ఇలా ఇద్దరి మధ్య తేడాలు చెబుతూ , తన తాజా హీరో రవితేజ ను ప్రశంసిస్తూ , రవితేజలో ఎనర్జీ అంటే తనకు ఎంతో ఇష్టమనీ , ఎంత ఒత్తిడిలో ఉన్నా సరదాగా ఉండడం ఆయనను చూసి నేర్చుకున్నాననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: