శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా దసరా. ఫుల్ మాస్ యాక్షన్ నేపథ్యంలో సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. ఇక ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో అలరించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. “నేను లోకల్” సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెండవ సినిమా ఇది. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమాలో వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదే చివరలో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో నానికి ధీటుగా లేడీ విలన్ రంగంలోకి దిగుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో పూర్ణ ప్రతినాయిక పాత్రలో నటించనున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఆమె ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందట. పూర్ణ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని అంటున్నారు. ఈమె పాత్ర గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
కాగా ఈసినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: