‘రాకెట్రీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Madhavan Rocketry Movie OTT Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rocketry,Rocketry Movie,Rocketry Telugu Movie,Rocketry Movie In OTT,Rocketry Releasing on OTT,Rocketry OTT Release Date Fixed,Latest Movies Releasing in OTT This Week, OTT Movie Releases This Month,Madhavan Rocketry Movie OTT Release Date Confirmed,Madhavan Rocketry Movie,Hero Madhavan, Madhavan Upcoming Movies,Madhavan Latest Movie Rocketry Releasing in OTT,Rocketry Movie Releasing in Amazon Prime Videos,Amazon Prime Videos, Rocketry Movie in Amazon Prime Videos,Madhavan Rocketry Movie Releasing in Amazon Prime Videos on July 26th,Rocketry Releasing in OTT On 26th July

చాలా గ్యాప్ తరువాత మాధవన్ దర్శకత్వంలో రాకెట్రీ. ది నంబి ఎఫెక్ట్ అన్న సినిమాతో అలరించిన సంగతి తెలిసిందే కదా. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈసినిమా రూపొందించారు. పాకిస్థాన్ కు గూఢచార్యం చేస్తున్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ఆయన ఎన్నో ఏళ్ల తరువాత నిర్దోషిగా నిరూపించబడి బయటకు వచ్చారు. ఆ తరువాత మళ్లీ ఇస్రో శాస్త్రవేత్తగా సేవలు అందించారు. ఇలాంటి నిజ సంఘటనలతో ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమాను ఈ జూలై 26 న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇక తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈసినిమా స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో చూడటం మిస్ అయిన వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

ఇక ఈసినిమాలో సిమ్రాన్ ఫీమేల్ లీడ్ లో నటించగా.. రజిత్ కపూర్, మిషా ఘోషల్, రవి రాఘవేంద్ర, గుల్షన్ గ్రోవర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. షారుఖ్ ఖాన్, సూర్య అతిధి పాత్రల్లో నటించిన ఈసినిమాను త్రికలర్ ఫిలిమ్స్, వర్గీస్ మూలన్ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × three =