తమిళ్ స్టార్ హీరో విక్రమ్ నిన్న కాస్త ఆస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. దీంతో విక్రమ్ ను చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం విక్రమ్ బాగానే ఉన్నారు.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే సన్నిహితులు తెలియచేశారు. అయితే విక్రమ్ ఆరోగ్య పరిస్థితులపై కొన్ని తప్పుడు కథనాలు కూడా వచ్చాయి. విక్రమ్ గుండెపోటుకు గురయ్యారని.. అందుకే హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఈవార్తలపై స్పందించిన విక్రమ్ తనయుడు ధృవ్ క్లారిటీ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తన సోషల్ మీడియా ద్వారా ధృవ్ విక్రమ్ హెల్త్ గురించి ‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులారా.. నాన్నకు చెస్ట్ లో కాస్త నలతగా అనిపించింది.. దాని కోసమే చికిత్స తీసుకున్నారు..బయట వినిపిస్తున్నట్టుగా ఆయనకు హార్ట్ ఎటాక్ రాలేదు.. ఇలాంటి రూమర్లు వింటుంటే మాకు ఎంతో బాధగా అనిపించింది.. ఇలాంటి సమయంలో మాకు, మా ఫ్యామిలీకి కావాల్సిన ప్రైవసీని మీరు ఇస్తారని అనుకుంటున్నాను.. చియాన్ ఇప్పుడు బాగానే ఉన్నారు.. ఒక్క రోజులోనే ఆయన్ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారేమో. ఈ స్టేట్మ్ంట్‌తో మీ అందరికీ ఓ క్లారిటీ, ఓ నమ్మకం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను.. ఇక ఈ రూమర్లన్నింటికీ పుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: