మహేష్-త్రివిక్రమ్ మూవీ సాలిడ్ అప్ డేట్.. ఆగష్ట్ నుండి షూటింగ్..!

Mahesh Babu and Trivikram Shooting Will be Starts From August,Mahesh Babu And Trivikram’s Upcoming Movie SSMB28: Production And Release Dates Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Upcoming Movie #SSMB28,#SSMB28 Movie Updates,SSMB28 Shoot Starts From August,Trivikram and Mahesh Babu Upcoming Movie #SSMB28,Mahesh Babu Upcoming Movies, Mahesh Babu latest Movie SSMB28 Updates,SS Thaman Music For #SSMB28 Movie,Mahesh Babu And Trivikram’s Upcoming Movie SSMB28 Release Date Announced,Mahesh Babu And Trivikram’s Upcoming Movie SSMB28 latest Updates, SSMB28 Shooting Updates,SSMB28 Shoot Start Soon

మహేష్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అంటే సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమా హిట్ అయింది కానీ ఖలేజా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. అయితే రిజల్ట్ సంగతి పక్కన పెడ్డితే ఈసినిమా చాలా మందికి మాత్రం నచ్చుతుంది. మహేష్ బాబు లోని కామెడీ యాంగిల్ ను ఈసినిమాతో బయటకు తీసుకొచ్చాడు త్రివిక్రమ్. ముఖ్యంగా మహేష్ కామెడీకి ఫిదా అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇక చాలా యేళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుంది. ఈసినిమా ఎప్పుడో అధికారికంగా ప్రటించారు మేకర్స్. ఇప్పటికే పూాజా కార్యక్రమాలు కూడా జరిగాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఇక ఈసినిమా గురించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్‌పై క్లారిటీ ఇస్తూ గ్లింప్స్‌ను విడుద‌ల చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్ట్ లో షూటింగ్ ప్రారంభించ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌య చేయ‌బోతున్న‌ట్లు కూడా గ్లింప్స్‌లో వెల్ల‌డించారు.

కాగా ఈసినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తుంది. దీనితో పాటు మధి కెమెరామెన్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =