తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా తెలుగు, తమిళ్ లో వస్తున్న సినిమా ది వారియర్. ఈసినిమా ఈనెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేథ్యంలో చిత్రయూనిట్ రెండు ప్రాంతాల్లోనూ సాలిడ్ గా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. తమిళ్ లో రామ్ కు ఇది డెబ్యూ సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఇక తన తమిళ్ ఎంట్రీకి దాదాపు 15 ఏళ్లు వెయిట్ చేశా అంటున్నాడు రామ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న తమిళనాడులో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 28 మంది సెలబ్రిటీలను అతిధులుగా ఆహ్వానించారు. లెజెండరీ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ తో పాటు ఇంకా ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక ఈసందర్భంగా రామ్ మాట్లాడుతూ.. తమిళ్ లో ఎంట్రీ కోసం 15ఏళ్లు వెయిట్ చేశా.. ఫైనల్ గా లింగుస్వామి లాంటి డైరెక్టర్ తో పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. ఈసినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేశా.. ఈ పాత్ర నాకుచాలా బాగా నచ్చింది.. ఇంకా ఈసినిమాకు ఇంత బజ్ క్రియేట్ అవ్వడంలో సగం క్రెడిట్స్ దేవి మ్యూజిక్కు కే ఇవ్వాలి అంటు తెలిపాడు. మరి ఇన్నేళ్లు వెయిట్ చేసిన రామ్ కు ఎలాంటి ఫలితం అందుతుందో చూద్దాం..
కాగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, వరలక్ష్మీశరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: