లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం ఇలా వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది టాలెంటెడ్ నటి సాయి పల్లవి . మొదటి నుండి పాత్ర ప్రధానమైన సినిమాలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మరో లేడీ ఒరియెంటెడ్ సినిమాతో వస్తుంది. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గార్గి. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై 15న ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక అప్పుడప్పుడు అప్ డేట్ ఇస్తున్న ఈసినిమా నుండి నేడు మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈసినిమా ట్రైలర్ ను రానా-నాని రిలీజ్ చేయగా.. తమిళ్ లో సూర్య, ఆర్య, అనిరుథ్, లోకేష్ కనగరాజ్ లు రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ ను బట్టి ఈసినిమా న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే కథతో నడుస్తుందని అర్థమవుతుంది. ట్రైలర్ అయితే ఆకట్టుకుంటుది. సాయి పల్లవి మరోసారి తన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తుందని అర్థమవుతుంది.
కాగా ఇంకా ఈసినిమాలో కాళీ వెంకట్, శరవణన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ భాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు. గోవిందా వసంత సంగీతం అందిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: