మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజి బిజీగా ఉన్నాడు. ఆ లిస్టులో ఉన్న సినిమాల్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఒకటి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఫైనల్ గా జులై29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. ప్రమోషన్స్ మాత్రం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన మూవీ పోస్టర్‌లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఫుల్ యదార్థ ఘటనల ఆధారంగా ప్యాక్డ్ యాక్షన్‌తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో వేణు మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. చాలా గ్యాప్ తరువాత వేణు ఈసినిమా ద్వారా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక నేడు వేణు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సీఐ మురళీ పాత్రలో నటిస్తున్నాడు. ఇక సీరియస్ లుక్ లో ఉన్న వేణు పోస్టర్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమా తరువాత వేణు మళ్లీ బిజీ అవుతాడేమో చూద్దాం..
Our favourite ever is back in a never before Powerful role 💥
Introducing #VenuThottempudi as CI Murali from #RamaRaoOnDuty 🔥#RamaRaoOnDutyOnJuly29@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @SamCSmusic @RTTeamWorks @LahariMusic pic.twitter.com/92ciBfxFBw
— SLV Cinemas (@SLVCinemasOffl) July 6, 2022
కాగా ఈసినిమాలో దివ్యాంక కౌశిక్, రజిష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: