శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఉప్పెన”, “శ్యామ్ సింగరాయ్”, “బంగార్రాజు” సినిమాలతో హ్యాట్రిక్ సాధించి, ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న కృతి శెట్టి తెలుగు, తమిళ పరిశ్రమల్లో వరుస అవకాశాలని అందుకుంటున్నారు. కృతిశెట్టి కథానాయికగా తెరకెక్కిన”ది వారియర్” సినిమా గురించి కృతి మాట్లాడుతూ..పోలీస్ స్టేషన్, రేడియో స్టేషన్ మధ్యలో ఓ రైల్వే స్టేషన్ ఉంటుందనీ , అక్కడే ప్రేమ పుడుతుందనీ , అది ఎలా అనేది సినిమాలో చూడాల్సిందేననీ , ఇది ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అనీ , ఇందులో ఓ పక్కింటి అమ్మాయిలాగా, క్యూట్‌గా, చలాకీగా కనిపిస్తాననీ , “ది వారియర్” సినిమాలో తన పాత్ర పేరు విజిల్ మహాలక్ష్మిఅనీ , ఓ రేడియో స్టేషన్‌లో ఆర్జేగా చేస్తూ ఉంటాననీ ,తన పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారనీ , దీనికోసం చాలానే హోంవర్క్ చేశాననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: