న్యాచురల్ స్టార్ నాని, కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘దసరా’. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం గత షెడ్యూల్‌లో స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. అంతకు ముందు నాని, కీర్తి సురేష్‌లపై ఓ భారీ పాట చిత్రీకరించారు. ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు. అయితే మధ్యలో నాని వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు తాజాగా కొత్త షెడ్యూల్ ను స్టార్ట చేసింది. ఈషెడ్యూల్ భారీగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో నాని మునుపెన్నడూ చేయని మాస్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రా హెయిర్ స్టయిల్, గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్ లో కనిపించనున్నారు. నాని ఈ సినిమాలో తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పడం విశేషం. నాని మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న దసరా భారీ స్థాయిలో రూపొందుతోంది. అంతేకాదు ఇప్పటికే విడుదలైన ‘దసరా’ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. నాని మాస్ గెటప్, టెర్రిఫిక్ అవతార్ ప్రేక్షకులని ఆకట్టుకుంది.
కాగా ఈసినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా, సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడిగా.. ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: