మైత్రీ మూవీ మేకర్స్ – క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సూపర్ హిట్ “మత్తు వదలరా” మూవీ ఫేమ్ డైరెక్టర్ రితేష్ రానా దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో “హ్యాపీ బర్త్ డే” మూవీ జులై 15 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నరేష్ అగస్త్య , వెన్నెల కిషోర్ , సత్య ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. లావణ్య త్రిపాఠి మిషన్ గన్ పట్టుకుని ఫైరింగ్ చేస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇటీవలే ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఇందులో వెన్నెల కిషోర్ పాత్ర హైలైట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
“హ్యాపీ బర్త్ డే” మూవీ లో చట్టసభలో గన్ బిల్ పాస్ చేయాలని రచ్చ చేసే మంత్రి రిత్విక్ సోది పాత్రలో ఆయన కనిపించనున్నారు. తాజాగా మరోసారి వెన్నెల కిషోర్ రోల్ కి సంబంధించి చిన్న వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో వెన్నెల కిషోర్ నైటీ వేసుకొని కనిపించారు. నైటీ వేసిన ఈ నాటీ ఫెలో ఎవరు సుయోధనా..? పేరు రిత్విక్ సోది.. ఓ వర్గానికి విరోధి’ అంటూ ఈ వీడియోలో డైలాగ్ వినిపించింది. రెండు మెషీన్ గన్స్ పట్టుకొని నైటీ వేసుకొని చాలా తన సీరియస్ ఫన్నీ ఎక్స్ ప్రెషన్ తో వెన్నెల కిషోర్ కనిపించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: