రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో బిగ్ బీ అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ప్రత్యేక పాత్రలో కనిపించిన సూర్య అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.ప్రపంచవ్యాప్తంగా వారం రోజులలో 250 కోట్లకు పైగా వసూళ్ళతో “విక్రమ్ ” మూవీ దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“విక్రమ్” మూవీ ఘన విజయం సాధించడంతో సంతోషంగా ఉన్న కమల్ హాసన్ ను మెగా స్టార్ చిరంజీవి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సందడి చేశారు. కమల్ కు చిరంజీవి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించారు. దర్శకుడు కనకరాజ్ ను కూడా చిరు అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ .. “విక్రమ్ “సినిమా విజయాన్ని అభినందిస్తూ తన ప్రియ మిత్రుడు కమల్ హాసన్ ను సన్మానించడం ఆనందంగా ఉందనీ , కమల్, సల్మాన్ ఖాన్, డైరెక్టర్ కనకరాజ్, “విక్రమ్” సినిమాకు టీమ్ కు నిన్న రాత్రి తన నివాసంలో పార్టీ ఇచ్చాననీ , “విక్రమ్” ఒక అద్భుతమైన సినిమా అనీ , మై డియర్ ఫ్రెండ్ కమల్ నీవు మరింత శక్తిమంతం కావాలని కోరుకుంటున్నాననీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: