మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ , అనసూయ , రావు రమేష్ , సప్తగిరి ముఖ్య పాత్రలలో నటించారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఆదివారం నాడు “పక్కా కమర్షియల్ “మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో .. మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్, రాశీ ఖన్నా డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పక్కా కమర్షియల్ కోణంలో ఉన్న ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: