మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికీ !” మూవీ జూన్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ కథానాయిక . హర్షవర్ధన్ , సుహాస్ , నదియా , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. “అంటే సుందరానికీ !”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ఈ మూవీ తమిళ , మలయాళ భాషలలోనూ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అంటే .. సుందరానికీ “ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరగనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ కానున్నారు. “అంటే సుందరానికీ !” మూవీ ప్రమోషన్స్ లో హీరో నాని బిజీగా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో నాని నటిస్తున్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: