‘మేజర్’ పై అనుష్క ప్రశంసలు..!

Anushka Shetty is all praises for Major Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, AnushkaShetty,Actress Anushka Shetty,Anushka Shetty About Major Movie,Anushka Shetty Says A Beautiful Tribute to Major Sandeep Unni Krishnan, AnushkaShetty Loved Watching Major Movie,Anushka Shetty About Sandeep Unni Krishnan Biopic Movie Major,Adivi Sesh Major Movie latest Updates, AnushkaShetty All Prises Major Movie,Anushka Shetty Says Loved Watching Major Movie,Anushka Shetty congratulate Team Major For Such a Beautiful Tribute to Sandeep Unni Krishnan

టాలీవుడ్ టాలెండ్ నటుడు అడివి శేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పటికే అడివి శేష్ అంటే డిఫరెంట్ కథలను ఎంచుకుంటాడని.. రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేస్తాడన్న పేరు ఉంది. అందుకే తను చేసిన సినిమాలన్నీ విజయాలను అందుకున్నాడు. ఇప్పుడు మేజర్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్ర‌జ‌లను రక్షించ‌డానికి త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టిన మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్ర‌మిది. ఈ సినిమాతో సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితాన్ని మాత్రమే కాదు.. దేశంకోసం ప్రాణాలకు సైతం తెగించే వీరులు ఎంత మంది ఉన్నారో కూడా గుర్తు చేశారు. ప్రివ్యూల నుండే ఈసినిమా మంటి టాక్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. చూసిన ప్రతిఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపించడమే కాదు భావోద్వేగానికి కూడా గురవుతున్నారు. తాజాగా ఈసినిమాపై అనుష్క కూడా స్పందించి ప్రశంసలు కురిపించింది. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కు ఇది ఒక అందమైన నివాళి.. ఇలాంటి సినిమాను మా ముందుకు తీసుకొచ్చినందుకు యూనిట్ కు చాలా థ్యాంక్స్.. సినిమా డైరెక్టర్ శశి కిరణ్ తిక్క, శేష్, వంశీ ఇంకా ప్రకాష్ రాజ్ గారు, రేవతి గారు, మురళీ శర్మ గారు, సయి ముంజ్రేకర్, శోభిత ధూళిపాళ్ల ఇతర నటీనటులు కాస్ట్ అండ్ క్రూ అందరికీ కంగ్రాట్స్.. ఈసినిమాను థియేటర్లలో చూడండి అంటూ అనుష్క తన ట్వీట్ లో పేర్కొంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.