ఇండస్ట్రీలో యంగ్ హీరోల హవా ఎక్కువైన తరువాత కొంతమంది హీరోలు మాత్రం వెనుకబడిపోయారని చెప్పొచ్చు. ఒకపక్క కుర్రహీరోలు కొత్త కొత్త కథలతో హిట్లు అందుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మరోపక్క కొంత మంది హిట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆ లిస్ట్ లో చాలామంది హీరోలే ఉండగా అందులో గోపీచంద్ కూడా ఒకరు. ఒకప్పుడు వరుస విజయాలు అందుకున్న గోపీచంద్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆమధ్య ఏ సినిమా తీసినా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. రీసెంట్ గా వచ్చిన సీటీమార్ తోనే చాలా కాలం తరువాత హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన ఆశ పక్కా కమర్షియల్ సినిమాపై ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మారుతి దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీని కూడా బాగా తన కథలో బాగా ఎగ్జిక్యూట్ చేయగలడు. ఇక ఈసినిమా జులై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే తాజాగా చిత్రయూనిట్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇక ఆ ప్రెస్ మీట్ లో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ సినిమాకు ప్రేక్షకుడు వచ్చేది హీరోహీరోయిన్లను చూసి మాత్రమే.. ప్రేక్షకులను రప్పించే బాధ్యత ప్రధానంగా హీరోహీరోయిన్లే తీసుకోవాలని.. హీరోహీరోయిన్లే తమ చిత్రం గురించి ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుందని.. నిర్మాతలను చూసి ఏ ప్రేక్షకుడు రాడని అన్నారు. అంతేకాదు ఇటీవల ఓ అగ్రహీరో వేదికపైనే డ్యాన్స్ చేశాడని, వారి సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసమే ఆ హీరో డ్యాన్స్ చేశాడని.. అందుకే ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో హీరోగా నటించిన గోపీచంద్ వస్తేనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చిత్రయూనిట్ కు తాను స్పష్టం చేశానని అరవింద్ పేర్కొన్నారు.
ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశీ ఖన్నా నటిస్తుంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: