సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అంటే సుందరానికీ’

Ante Sundaraniki Clears Censor Formalities,Nani’s Ante Sundaraniki Gets U Certificate At Censor Board,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki Gets U Certificate At Censor Board,Ante Sundaraniki in Cinemas from JUNE 10,Ante Sundaraniki Movie,Ante Sundaraniki Telugu Movie,natural Star Nani Ante Sundaraniki,Nani Ante Sundaraniki Movie Updates, Ante Sundaraniki Movie Releasing on June 10th,Nani Upcoming Movie Releasing on 10th June,Ante Sundaraniki Gets U Certificate,Ante Sundaraniki Movie Clear Censor U Certificate

న్యాచురల్ స్టార్ నాని కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఫ్యాన్స్ కూడా నానిని సీరియస్ రోల్స్ లో కంటే కామెడీ ఎంటర్ టైనర్స్ లో నటించడానికి ఎక్కువ ఇష్టపడతారు. అయితే మొదటి నుండి కాస్త కామెడీ ఎంటర్ టైనర్ లతోనే అలరించిన నాని ఈమధ్య కాస్త రూట్ మార్చి సీరియస్ మోడ్ లోకి వచ్చాడు. అయితే నాని ఫుల్ లెంగ్త్ సీరియస్, కంపోజ్డ్ పాత్రలు సినీ ప్రేక్షకులకు కూడా కనెక్ట్ కాలేదు. అందుకే ఆ మధ్య వచ్చిన వి, టక్ జగదీష్ లాంటి సినిమాలు ఏవరేజ్ హిట్ లు అందుకున్నాయి. ఇక రీసెంట్ గా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ కూడా కాస్త సీరియస్ మోడ్ ఉన్న సినిమానే కానీ కథ కొంచం డిఫరెంట్ గా ఉండటంతో హిట్ అయిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు అంటే సుందరానికీ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈసినిమాలో మరోసారి వింటేజ్ నాని ని చూసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాని, నజ్రియా కాంబినేషన్, అలానే కామెడీ ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఇక మరో వారంలో ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఈసినిమాకు క్లీన్ యూ ఇచ్చారు చిత్రబృందం. దీంతో ఈసినిమా హెల్తీ కామెడీతో అలరించంబోతుందని అర్థమవుతుంది. చూద్దాం మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో…

కాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో న‌దియ‌,హ‌ర్ష వ‌ర్ధ‌న్‌,రాహుల్ రామ‌కృష్ణ‌,సుహాస్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + twenty =