మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పక్కా కమర్షియల్. కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్.. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. అలాగే పాటలు కూడా రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి అందాల రాశి అనే పాట ప్రోమో ను రిలీజ్ చేయగా తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అందాల రాశి..మేకప్ ఏసి నాకోసమొచ్చావే.. స్వర్గంలో కేసే నా మీదేసి..భూమ్మీద మూసావే..’ అంటూ సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది. గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుండగా.. రాశీ ఖన్నా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక ఈపాటను కృష్ణకాంత్ రాయగా.. సాయిచరణ్ భాస్కరుణి, రమ్య బెహెరా పాడారు.
Here it is, the 2nd Single #AndalaRaasi full song from #PakkaCommerical out now!🕺💃
▶️ https://t.co/gqpA0CLqmL#AlluAravind @YoursGopichand @DirectorMaruthi@RaashiiKhanna_ #BunnyVas @JxBe @kk_lyricist #SaiCharanBhaskaruni @iamRamyaBehara #KarmChawla @SKNonline @adityamusic pic.twitter.com/ProqOKemx7
— UV Creations (@UV_Creations) June 1, 2022
ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశీ ఖన్నా నటిస్తుంది. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ – యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జకేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కరమ్ చావ్లా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: