సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచ్ లర్ లిస్ట్ లో ఉన్న హీరోలు అందరూ దాదాపు పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రభాస్ తో పాటు ఒకరిద్దరూ లిస్ట్ లో ఉన్నారు అంతే. కరోనా టైంలోనే దాదాపు చాలా మంది పెళ్లిళ్లు చేసేసుకున్నారు. ఇక హీరోయిన్లలో కూడా కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఈ హీరోయిన్ ఎవరో కాదు పూర్ణ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాాగా తన ట్విట్టర్ ద్వారా తనకు బాబోయే భర్తను పరిచయం చేసింది పూర్ణ. షానిద్ అసిఫ్ అలీ అనే బిజినెస్ మ్యాన్ ను పూర్ణ పెళ్లి కోబోతుంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. ‘తన కుటుంబ ఆశీర్వాదాలతో తన జీవితంలోని మరో భాగంలోకి అడుగుపెడుతున్నా’ అంటూ ట్వీట్ లో పేర్కొంది. షానిద్ అసిఫ్ అలీ జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఆయన నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది.
With the blessings of family stepping to my next part of life❤️💍 and now it’s official ❤️ pic.twitter.com/v7Qo04t3Ws
— Purnaa (@shamna_kkasim) June 1, 2022
శ్రీ మహాలక్ష్మి మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పూర్ణ పలు భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఈమధ్య అవకాశాలు పెద్దగా లేకపోయినా అప్పుడప్పుడూ పలు సినిమాల్లో కనిపిస్తుంది. ఇంకా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తుంది. నటిగానే కాకుండా, బుల్లి తెరపై ‘ఢీ’, తదితర షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: