“తేనె మనసులు “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సినిమా తెరపై సాహసాలతో డేరింగ్ అండ్ డాషింగ్ అనిపించుకున్న సూపర్ స్టార్ కృష్ణ ధైర్య సాహసాలకు మారు పేరుగా నిలిచి, 70 ఎంఎం, ఈస్ట్ మన్ కలర్ సినిమా, సినిమాస్కోప్, డీటీఎస్ సినిమా, కౌ బాయ్ సినిమా, స్పై సినిమా ఇలా అన్నింట్లోనూ మొట్టమొదటి అడుగు వేసి అందరికీ దారి చూపించారు. నటుడు , నిర్మాత , దర్శకుడు , స్టూడియో అధినేతగా కృష్ణ కళామతల్లికి సేవలందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు (మే 31) సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు , అభిమానుల బర్త్ డే శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వెల్లు వెత్తాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార , తన తాత(కృష్ణ )కు స్పెషల్ బర్త్ డే విషెస్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తామిద్దరి ఫొటోను సితార ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫొటో వైరల్ గా మారింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: