లెజెండరీ యాక్టర్ , నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా.. నటులు జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.యుగపురుషుడు, మహా నేత, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు దేశం పార్టీ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Nandamuri Brothers Young Tiger #JrNTR and #KalyanRam paid tribute to #SrNTR on the occasion of his 100th Birth Anniversary!! #JoharNTR #NTR #TeluguFilmNagar pic.twitter.com/8c3vs2r6Gu
— Telugu FilmNagar (@telugufilmnagar) May 28, 2022
నటుడు , స్టూడియో అధినేత , నిర్మాత , దర్శకుడు గా కళామతల్లికి సేవలు అందించిన ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజలకు మేలుకలిగేలా పలు పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏడాదిపాటు జరగనున్నాయి. శత జయంతి వేడుకల్లో తమ కుటుంబం నుంచి నెలకు ఒకరుచొప్పున కార్యక్రమాల్లో పాల్గొంటారనీ , వారానికి ఐదు సినిమాలు, రెండు సదస్సులు నిర్వహిస్తామనీ , నెలకు రెండు ఎన్టీఆర్ పురస్కారాలను ప్రధానం చేస్తామనీ బాలకృష్ణ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.