వైజాగ్ కు జక్కన్న-రణబీర్..!

Ss Rajamouli and Ranbir Kapoor to visit Vizag,Ranbir Kapoor And Rajamouli To Visit Vizag For Brahmastra Promotions,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Version,Brahmastra Telugu Movie,Brahmastra Movie Promotions,Brahmastra Rajamouli Promotions,Rajamouli Promotions for Brahmastra, Ranbir Kapoor and Rajamouli visit Vizag For Promotions of Brahmastra Movie,Brahmastra movie latest Updates,Brahmastra Promotions Updates,Brahmastra Telugu Movie Promotions at Vizag

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్‌కపూర్‌, అలియా భట్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాలో రణ్‌బీర్‌కపూర్‌ శివ పాత్రలో నటిస్తుండగా అలియా ఇషా పాత్రలో కనిపించనుంది. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా శివుని నేపథ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో రణబీర్ శివ పాత్రలో నటిస్తుండటం.. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ను బట్టి కూడా ఈవిషయం అర్థమవుతుంది. అంతేకాదు ఈసిమా షూటింగ్ వారణాసి లో మొదలై అక్కడే పూర్తి చేశారు కూడా ఈనేపథ్యంలో రణబీర్ కపూర్, అలియా భట్ అలానే అయాన్ ముఖర్జీ పలు శివుని ఆలయాలు కూడా దర్శించారు. ఇక తాజా సమాచారం ప్రకారం రణబీర్ కపూర్ వైజాగ్ రానున్నట్టు తెలుస్తుంది. రాజమౌళి తో పాటు రణబీర్ కపూర్ కూడా వైజాగ్ లో ఉన్న పవర్ ఫుల్ శివుని ఆలయానికి వెళ్లనున్నారట. అక్కడ ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అలియా, రణబీర్ కూడా ఈప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

కాగా ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, టాలీవుడ్ అగ్రహీరో నాగార్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్ బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా బ్ర‌హ్మాస్త్ర చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 20 =