టాలీవుడ్ లో డైరెక్టర్ గా అలానే స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా గా కూడా మంచి పేరుతెచ్చుకున్నాడు. కె.రాఘవేంద్ర రావు వద్ద పనిచేసిన ఆయన సీతా రాముల కళ్యాణం చూతము రారండి సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఈసినిమా విజయం దక్కించుకోవడంతో ఆతరువాత పలు సినిమాలను తెరకెక్కించాడు.ఇక నేడు వై.వి.యస్ చౌదరి పుట్టిన రోజు. ఈ సందర్బంగా తనకు ఇండస్ట్రీ నుండి విషెస్ అందుతున్నాయి. ఈనేపథ్యంలోనే యంగ్ హీరో రామ్ కూడా తనకు బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్ డే వై.వి.యస్ చౌదరి గారు.. మీరు లేకపోతే ఈరోజు ఈరోజులా అనిపించేది కాదు అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు రామ్. ఇక వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన సినిమా దేవదాస్. ఈసినిమాతోనే రామ్ తెలుగు తెరకు పరిచయమయ్యాడు రామ్. మొదటి సినిమాతోనే ఎనర్జిటిక్ హీరోగా పేరుతెచ్చుకోవడమే కాకుండా.. తన నటన తో, డాన్స్ తో, యాక్షన్ సన్నివేశాల్లో కూడా ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టిందో అందరికీ తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy Birthday #YVSChowdary garu..
..today wouldn’t have felt like Today if not for you!
Love..#RAPO pic.twitter.com/rjwCL0IjRq
— RAm POthineni (@ramsayz) May 23, 2022
ప్రస్తుతం రామ్ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ది వారియర్ పేరుతో ఈసినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రామ్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఆది పినిశెట్టి, అక్షర గౌడ, వరలక్ష్మీశరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: