పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సిల్వర్ జూబ్లీ సినిమా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పిరిట్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ప్రభాస్ పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండగా.. ఆ సినిమాలు పూర్తయిన తరువాత ఈసినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈసినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో భూషణ్ కుమార్ నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నటించే హీరోయిన్ పై ఇప్పటికే పలు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఆమధ్య ఒక కొరియన్ హీరోయిన్ నటిస్తున్నట్టు వార్తలు రాగా వాటికి అప్పుడే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పుడు కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఈవార్తలపై క్లారిటీ ఇచ్చారు కియారా టీమ్. ‘స్పిరిట్’ సినిమా కోసం తమని ఎవరూ ఇంతవరకూ సంప్రదించలేదని కియారా టీమ్ స్పష్టం చేశారు. ఈ సినిమాలో కియారా చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని.. ఆమె చేసే కొత్త ప్రాజెక్టుల వివరాలను అధికారికంగా తెలియజేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం కియారా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కెరీర్ లో బిజీగా ఉంది. ఇక ఒకపక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగులో కూడా సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్- శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా తెలుగుతో పాటు తమిళ్ లో కూడా రిలీజ్ కానుంది. వినయ విధేయ రామ సినిమా తరువాత చరణ్ తో కియారా కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: