పరుశురాం దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తూనే ఉన్నాం. ఎన్నో అంచనాలమధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను రీచ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. మహేశ్ బాబు చాలా స్టైలీష్‌గా కనిపించడంతో పాటు కామెడీ, యాక్షన్‌తో అదరగొట్టడం.. దానికితోడు మహేష్, కీర్తి సురేష్ మధ్య వచ్చే సన్నివేశాలు.. వెన్నెల కిశోర్ కామెడీ టైమింగ్‌తో ఇలా అన్నీ సినిమాకు కలిసొచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రోజు రోజుకు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. కేవలం ఐదు రోజుల్లో ఈసినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అంతేకాదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు రాబట్టిన ఫాస్టెస్ట్ ప్రాంతీయ సినిమాగా కూడా సర్కారు వారి పాట మరో కొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఆనందాన్ని తెలియచేశారు.
#BlockbusterSVP is setting new benchmarks in TFI 🔥#SVP is now the fastest to 100 Crores Share worldwide for a Regional Film ❤️🔥#100CrShareSarkaruVaariPaata 💥#SarkaruVaariPaata
Super🌟@urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 pic.twitter.com/xISLWHYMy8
— #BlockbusterSVP 💯 (@SVPTheFilm) May 17, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: