మనాలీ లో “ఏజెంట్ “

Akhil Akkineni Agent Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Agent,Agent Movie,Agent Telugu Movie,Agent Movie Updates,Agent Latest Updates,Akhil Akkineni Agent Movie,Akhil Akkineni Agent Movie Teaser,Agent Telugu Movie Teaser, Agent Akhil Akkineni Movie Shooting Updates,Agent Latest Shooting updates From Manali,Agent Shooting At Manali,Agent Movie schedule at Manali

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ ఆగస్ట్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నెల్లూరు, విశాఖపట్నం పోర్ట్ లలో , హైదరాబాద్ , యూరోప్ లోని బుడాపెస్ట్ లో “ఏజెంట్” మూవీ షూటింగ్ షెడ్యూల్స్ జరుపుకున్న విషయం తెలిసిందే . “ఏజెంట్” మూవీ తాజా షెడ్యూల్ సోమవారం నుంచి మనాలీలో ప్రారంభం అయ్యింది. హీరో అఖిల్‌, కొంతమంది ఫైటర్ల మధ్య ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ వారమంతా మనాలీలోనే చిత్రీకరణ సాగుతుందని సమాచారం. ఉన్నతమైన సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న “ఏజెంట్” మూవీలో అఖిల్‌ గెటప్‌, పాత్ర చిత్రీకరణ , మమ్ముటి – అఖిల్‌ మధ్య సన్నివేశాలు, యాక్షన్‌ దృశ్యాలు ఇవన్నీ ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నాయని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 8 =