‘ప్రాజెక్ట్ K’ వరుస అప్ డేట్స్ కు ఇంకా టైముంది..!

Prabhas Project K Movie Latest Update,Nag Ashwin About Prabhas Introduction Scene In Project K,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Project K,Project K Movie,Project K Telugu Movie,Project K Movie Updates,Prabhas Project K Movie,Pan Indian Star Prabhas Project K Movie Latest Updates, Rebel Star Prabhas Project k Movie,Director Nag Ashwin about Prabhas Introduction Scene,Nag Ashwin About Introduction scene in Project K Movie,Prabhas Introduction scene in Project K Movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎలా ఎదురుచూస్తారో ఇప్పటికే చాలా సార్లు చూశాం. కొంతమంది నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగానే డైరెక్టర్లను అడిగేస్తుంటారు అప్ డేట్స్ ఇవ్వమని. ఈ విషయంలో నాగ్ అశ్విన్ కు కూడా కొత్తేం లేదు. ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఇప్పటికే చాలా సార్లు నెటిజన్లు సోషల్ మీడియాలో అడగటం జరిగింది.. దానికి నాగ్ అశ్విన్ కూడా సమాధానం చెబుతుంటాడు. తాజాగా మరోసారి ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా అన్నా గుర్తున్నామా అంటూ నాగ్ అశ్విన్ ట్యాగ్ చేయగా దానికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. గుర్తున్నారు.. ప్రభాస్ ఇంట్రడక్షన్ బిట్ తో కలిపి ఇప్పుడే ఒక షెడ్యూల్ అయింది.. ప్రభాస్ చాలా కూల్ గా కనిపిస్తున్నారు.. జూన్ ఎండింగ్ నుండి మరో షెడ్యూల్ ను స్టార్ చేస్తాము.. రిలీజ్ ఆర్డర్ లో ఆఖరిలో ఉన్నాం కదా.. వరుసగా అప్ డేట్స్ ఇవ్వడానికి చాలా టైమ్ ఉంది.. అందరూ ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు అంటూ రిప్లై ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం ప్రభాస్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నసంగతి తెలిసిందే కదా. అందులో ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో పూర్తి చేసుకుంటుంది. ఇంకా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా షూటింగ్ ను జరుపుకుంటుంది. వీటితో పాటు సందీప్ వంగా తో స్పిరిట్ సినిమా ఉంది. ఇంకా మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో.. ఫ్యాన్య్ ఎప్పుడు చూస్తారో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + seventeen =