తెలుగు సినిమాల్లో బాలీవుడ్ హీరోలు, హిందీ సినిమాలలో టాలీవుడ్ హీరోలు నటిస్తున్న విషయం తెలిసిందే. చిరు “గాడ్ ఫాదర్” మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించారు. అమీర్ “లాల్ సింగ్ చద్దా” మూవీ లో నాగచైతన్య నటించారు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “F 2” మూవీ సీక్వెల్ “F 3 ” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్ర కై ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నడియాడ్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ , సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఫర్హాద్ సంజీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న “కభీ ఈద్ కభీ దివాలీ” హిందీ మూవీ షూటింగ్ 13 వ తేదీ ముంబై లో ప్రారంభం అయ్యింది.వెంకటేష్ , సల్మాన్ మంచి స్నేహితులు. సల్మాన్ “బాడీగార్డ్” మూవీ తెలుగు రీమేక్ లో వెంకటేష్ నటించారు. దాంతో.. వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ మరింతగా పెరిగింది. ఆ స్నేహంతోనే తన సినిమాలో ఓ కీలక పాత్ర చేయమని వెంకీని సల్మాన్ కోరారు. సల్మాన్ తో నటించడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే వారంలో వెంకటేష్ “కభీ ఈద్ కభీ దివాలీ”సెట్స్ లో జాయిన్ కానున్నట్టు సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: