టీమిండియా కూల్ కెప్టెన్ అంటే ఎవరి పేరు చెబుతారు.. ఇంకెవరూ ధోనీనే. కూల్ కెప్టెన్ ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ధోనికి స్పెషల్ పేజ్ ఉంటుంది. ఎన్నో మ్యాచ్ లలో.. టీమిండియా ఓడిపోతుందనుకునే మ్యాచ్ లలో కూడా తన కూల్ ఫినిషింగ్ తో గెలిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ధోని కెప్టెన్ గా మాత్రమే కాకుండా దాదాపు చాలా బాధ్యతల నుండి తప్పుకున్నాడు. ఇక ఒకపక్క క్రికెట్ ఆడుతూనే మరోపక్క బిజినెస్ రంగంలోకి కూడా వెళుతున్నాడు. ఇప్పటికే చాలా వాణిజ్య ప్రకటనలకు అంబాసిడర్ గా ఉన్నాడు. మరోపక్క ఫామింగ్ కూడా మొదలుపెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే గతకొద్ది కాలంగా ధోని సినిమా రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ వార్తలు రావడంతో ధోని హీరోగా వస్తాడేమో అనుకున్నారు కానీ నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అది కూడా నయనతార హీరోయిన్ గా ఈసినిమా వస్తున్నట్టు కథనాలు కూడా చాలా వచ్చాయి. ఇక ఇప్పుడు ఈరూమర్లకు క్లారిటీ వచ్చేసింది. ఈ వార్తలపై స్పందించి ధోని ప్రొడక్షన్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని.. ప్రస్తుతానికి తమ టీమ్ ఓ మంచి ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అన్నీ వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అప్పటి వరకూ ఎలాంటి అసత్యాలు ప్రచారం చేయోద్దని విజ్ఞప్తి చేసింది. మరి దీంతో ఇప్పటికైనా రూమర్లు ఆగుతాయేమో చూద్దాం.
కాగా నయనతార కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ఇటీవలే విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కతు వాకుల రెండు కాదల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. దీనితో పాటు పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: