శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న “#Thalapathy66” మూవీ చెన్నై లో పూజా కార్యక్రమం తో ప్రారంభం అయిన విషయం తెలిసిందే.మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ తో ప్రారంభం అయిన ఈ మూవీ లో శరత్ కుమార్ , ప్రకాష్ రాజ్ , శ్యామ్ , యోగిబాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“#Thalapathy66” మూవీ హైదరాబాద్ లో పలు లొకేషన్స్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇప్పుడు రష్మిక “#Thalapathy66” మూవీ సెట్స్ లో జాయిన్ అయ్యారు. మేకప్ తో షూటింగ్ కు సిద్ధంగా ఉన్నాననీ , సెట్ లోంచి పిలుపు వచ్చిందనీ , సెట్ లో చిరుత దర్శకుడు వంశీ పైడిపల్లి , హీరో విజయ్ , చిత్ర యూనిట్ ను కలిశాననీ , రోజంతా వారితో స్పెండ్ చేయడం బాగుందనీ , హ్యాపీ హ్యాపీ అంటూ సెట్ లో హీరో విజయ్ తో తొలి రోజు అనుభవాలను సోషల్ మీడియా లోరష్మిక అభిమానులతో పంచుకున్నారు. “#Thalapathy66” మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 23 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.