డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అలానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఇదిలా ఉండగా మే 9న విజయ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే విజయ్ బర్త్ డేకు అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా చిత్రయూనిట్. ఇక నేడు ఆ అప్ డేట్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు. ‘లైగర్’ థీమ్ సాంగ్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక విజయ్ కూడా ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఎదురుచూశాం.. ఇక మా వేట మొదలయ్యింది” అంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా విజయ్ మరో ట్వీట్ కూడా చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ గా మారింది. అదేంటంటే.. తన సినిమా ప్రమోషన్ తో పాటు మిగిలిన సినిమాల అప్ డేట్ కూడా ఇస్తున్నాడు విజయ్. విజయ్ మరో ట్వీట్ లో.. నా బర్త్ డే రోజున చాలా సినిమాల ప్రమోషన్స్ ఉన్నాయి.. అందరికీ విజయ్ దేవరకొండ బర్త్ డే సెంటిమెంట్ ఎక్కువైపోయింది అంటూ.. లైగర్, 11, ఎఫ్3, మేజర్, అంటే సుందరానికి, పృద్వీరాజ్ ఇలా సినిమాల హ్యాష్ ట్యాగ్ లు ఇచ్చాడు.
So many movie promotions on my birthday! It is like a festival day 😀
Andariki Vijay Deverakonda birthday sentiment ekva ipoindi..
All will do well, I shall share my power 🙂#Liger #VD11 #Major #F3 #AnteSundaraniki #Prithviraj
— Vijay Deverakonda (@TheDeverakonda) May 7, 2022
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.