ఈమధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలను ఆయా పరిశ్రమలు కోల్పోయాయి. ఈ ఏడాది మొదలైన రెండు నెలల్లోనే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కన్నుమూశారు. ఇక కన్నడ పరిశ్రమలో కూడా ఎంతో మంది ప్రముఖులను కోల్పోయింది. ఇప్పుడు తాజాాగా మరో టాలెంటెడ్ నటుడిని కోల్పోయింది కన్నడ పరిశ్రమ. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు మోహన్ జునేజా నేడు కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. దీంతో కన్నడ సినీ నటులు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇప్పటివరకూ కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించి నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు మోహన్ జునేజా. చెల్లాట అనే సినిమా ఆయనకు నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక పలు సీరియల్స్ లో కూడా నటించారు మోహన్. రీసెంట్‌గా విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ కె.జి.యఫ్ ఛాప్టర్ 1, కె.జి.యఫ్ ఛాప్టర్ 2 చిత్రాల్లో ఈయన ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: