శరత్ మండవ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. పక్కా కమర్షియల్ అంశాలతో యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమా రూపొందుతుంది. . ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక జూన్ 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి ఒక్కొక్క పాటను రిలీజ్ చేస్తున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ‘బుల్ బుల్ తారంగ్’ అనే మొదటి సాంగ్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సెకండ్ సింగిల్ సొట్టల బుగ్గల్లో అంటూ వచ్చే ఈ రెండో పాటను నేడు రిలీజ్ చేశారు. రవితేజ, దివ్యాంశ కౌశిక్‌లపై చిత్రీకరించిన ఈపాటకు కళ్యాణ్ చక్రవర్తి చక్కని సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్ అభ్యంకర్ లవ్లీగా ఈ పాటని ఆలపించారు. ఈ పాటలో రవితేజ, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకుంది.
The Lovely Melody #SottalaBuggallo from #RamaRaoOnDuty out now 🎧
A @SamCSmusic Musical.@RaviTeja_offl @directorsarat @itsdivyanshak @rajisha_vijayan @HariPriyaSinger #NakulAbhyankar #KalyanChakravarthy @RTTeamWorks @SLVCinemasOffl @LahariMusic pic.twitter.com/VvLF3vK0jy
— SLV Cinemas (@SLVCinemasOffl) May 7, 2022
ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.