శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలక పాత్రలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , దసరా స్పెషల్ వీడియో , “ఊ ఆ అహా అహా” సాంగ్ మేకింగ్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్ట్ ఫిల్మ్ నుండి ఆయన సినిమాలకు ఎడిటర్ గా పనిచేస్తున్న తమ్మిరాజు “F 3 ” మూవీ గురించి మాట్లాడుతూ .. “F 3 ” మూవీ డబ్బు చుట్టూ తిరిగే కథ అనీ , మానవ సంబంధాలు ఎంతలా డబ్బుతో ముడిపడి ఉన్నాయనేది వినోదాత్మకంగా దర్శకుడు తెరకెక్కించారనీ , కథే కొత్తగా ఉంటుందనీ , రష్ చూశాక సినిమా సూపర్‌హిట్ అనిపించిందనీ , వెంకటేష్, వరుణ్‌తేజ్ సహా నటీనటులు అందరూ అద్భుతంగా నటించారనీ , కామెడీ సినిమాలను ఎడిట్ చేయడం చాలా కష్టమనీ , అనిల్ రావిపూడి సినిమాల్లో అన్ని కామెడీ పంచులు ఉంటాయనీ , అందులో ఏది కుదించాలన్నా కష్టంగా ఉంటుందనీ , అయితే కథకు అవసరమైనదే అంతిమంగా మిగులుతుందనీ, “F 2” కంటే “F 3’లో రెండింతల ఫన్ ఉంటుందనీ , ప్రేక్షకులు రెండు రెట్లు ఎంజాయ్ చేస్తారనీ చెప్పారు
[subscribe]
.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: