మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన “గని “మూవీ ఏప్రిల్ 8 వ తేదీ రిలీజ్ కానుంది. బాక్సర్ గా నటించిన హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.“గని” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన “గని” చిత్రం విడుదల అవుతున్న సందర్భంగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా వైవిధ్యంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘చాలా గట్టిగా కొట్టేలా ఉన్నాడు’ అనే అర్థం వచ్చేలా.. ఒక మీమ్‌ని ఆయన ట్వీట్ చేశారు.ఒక మీమ్‌తో “గని” టీమ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ రామ్ చరణ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనికి స్పందించిన వరుణ్ తేజ్.. ‘‘హాహా.. లవ్ యు అన్న’’ అంటూ రిప్లయ్ ఇచ్చారు.
#Ghani@IAmVarunTej pic.twitter.com/QKg9NlQLUA
— Ram Charan (@AlwaysRamCharan) April 7, 2022
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: