అఖిల్ బర్త్ డే.. ‘ఏజెంట్’ నుండి బ్లాస్టింగ్ పోస్టర్ రిలీజ్..!

Team Agent Releases A Blasting Poster On The Occasion of Akhil’s Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Akhil,Hero Akhil,Akhil Birthday,Akhil happy Birthday,Akhil HBD,Akhil Movie Updates,Actor Akhil upcoming Movie,Akhil Latest Movie Updates,Akhil New Movie Updates,Akhil New Movie Agent, Agent Telugu Movie,Team Agent Releases A Blasting Poster,Blasting Poster From Agent Movie,Akhil Agent Poster Released,Agent Movie Poster Released on the occasion of Akhils Birthday, Agent Movie Poster Released,Agent Movie Poster Out Now

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. మొదట వరుసగా మూడు ఫ్లాప్స్ ను అందుకున్న అఖిల్ ఇటీవలే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో ఫైనల్ గా ఒక హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి సురేందర్ రెడ్డి సినిమా అంటే హీరోల మేకోవర్ లు ఖచ్చితంగా పూర్తిగా మార్చేస్తాడు. ఇక ఈసినిమాలో కూడా అఖిల్ మేకోవర్ పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో అర్థమైపోయింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా నేడు అఖిల్ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో చిత్రయూనిట్ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌ లో అఖిల్ సిగరేట్‌ తాగుతూ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ పోస్టర్ తో ఆ అంచనాలు మరింత పెరిగాయి..మొత్తానికి అఖిల్ ఓ సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడన్న విషయం అర్థమవుతుంది.

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు. ఆగష్ట్ 12న ఈసినిమాను రిలీజ్ కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =