పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే తను నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. దాదాపు మూడేళ్ల పాటు ఈసినిమా కోసం ఎదురుచూసిన ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులందరికీ ఈసినిమా నచ్చేసింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం తన ఫోకస్ ను తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై పెట్టాడు. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టింది. నిజానికి ఈసినిమాను కూాడా ఈ ఏడాదే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ టైమ్ పడుతుండటంతో వచ్చే ఏడాదికి షిప్ట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం ప్రభాస్ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్ అలానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ప్రభాస్ కూడా ఈ మధ్య రాధేశ్యామ్ ప్రమోషన్స్ అంటూ బిజీగా ఉండటంతో ఈ రెండు సినిమాల షూటింగ్ లకు బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్వరలోనే మళ్లీ ప్రభాస్ షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నాడట. ఈసారి ఒకేసారి పార్లల్ గా రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొనున్నాడట. అంతేకాదు.. “సలార్” మరియు “ప్రాజెక్ట్ కే” రెండు సినిమాలు కూడా భారీ యాక్షన్ సీక్వెన్స్ లతోనే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























