తమిళ హీరోలు తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడమే కాదు.. ఇప్పుడు స్ట్రైయిట్ తెలుగు సినిమాలనే చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మన తెలుగు దర్శకుల టాలెంట్ కు ఫిదా అవుతున్న కోలీవుడ్ హీరోలు టాలీవుడ్ కు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా తెలుగులో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ముందు శేఖర్ కమ్ములతో సినిమాను ప్రకటించిన ధనుష్ ఆ తరువాత వెంటనే యూత్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్టు ధనుష్ ప్రకటించాడు. ఇక వాటిలో ప్రస్తుతం వెంకీ అట్లూరి సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లి ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సార్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు వెంకీ తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ధనుష్ తన సోషల్ మీడియా ద్వారా వెంకీ కి బర్త్ డే విషెస్ అందించారు. నా మొదటి తెలుగు-తమిళ్ డైరెక్టర్ అయిన వెంకీ కి హ్యాపీ బర్త్ డే అంటూ ఒక ఫొటోను పోస్ట్ చేశారు.
Wishing a very happy birthday to venky atluri director of my first Tamil/telugu bilingual Vaathi / Sir. God bless you venky. Have a blast. pic.twitter.com/XeyPsJ5WGd
— Dhanush (@dhanushkraja) April 6, 2022
కాగా ఈ సినిమాలో ధనుష్ కాలేజ్ మాస్టర్ గా కనిపించనున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గాపనిచేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: