“ఆచార్య”లో చిరంజీవి తో రామ్ చరణ్ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

Ram Charan Working Experience with Mega Star Chiranjeevi in ​​Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ram Charan,Mega Power Star Ram Charan,Ram Charan Dream Comes True,Ram Charan movies,Ram charan latest Blockbuster movie RRR,Ram Charan In Acharya Movie, Ram Charan with Chiranjeevi Movie Acharya,Ram Charan Dream Comes True with Acharay movie,Ram Charan and Chiranjeevi movie Acharya,Acharya,Ram Charan Dream come true Working with Chiranjeevi

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. సోనూసూద్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ లో హీరోయిన్ రెజీనా ఫస్ట్ టైమ్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. “ఆచార్య” మూవీ లో టెంపుల్ టౌన్ సెట్ ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుందని సమాచారం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రామ్ చరణ్ “మగధీర “, “బ్రూస్ లీ” మూవీస్ లో మెగా స్టార్ చిరంజీవి అతిథి పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “ఖైదీ నం.150” మూవీ లో రామ్ చరణ్ ఒక సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే పూర్తి స్థాయి పాత్రల్లో మాత్రం ఈ ఇద్దరు ఏ సినిమాలోనూ కనిపించలేదు. 13 ఏళ్ల కెరీర్ లో తొలి సారి తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి చరణ్ నటించిన సినిమా “ఆచార్య “. రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ … గత కొంత కాలంగా నాన్న(చిరంజీవి )తో కలిసి నటించాలని ఎదురుచూస్తున్న తనకు “ఆచార్య”తో ఆ కల నెరవేరిందనీ , ఓ నటుడిగా , స్టార్ గా ఈ చిత్రంలో అడుగుపెట్టలేదనీ , ఓ స్టూడెంట్ గా మాత్రమే అడుగుపెట్టాననీ , ఈ మూవీ చిత్రీకరణ సమయంలో నాన్న నుంచి చాలా నేర్చుకున్నాననీ , షూటింగ్ లో నాన్న తనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనీ ,తాను మిస్టేక్స్ చేస్తున్నా, వన్ మోర్ టేక్ తీసుకుంటున్నా ఎక్కడా తనను డిస్ట్రబ్ చేయలేదనీ , చాలా కూల్ గా సపోర్ట్ చేశారనీ , ఈ విషయంలో నాన్నకు రుణపడి ఉంటాననీ , మెగా అభిమానులతో పాటు తాను కూడా “ఆచార్య ” మూవీ కై ఆసక్తితో ఎదురుచూస్తున్నాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 4 =